ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 మే 2020 (23:58 IST)

ఏపీలో 74,565 వాహనాల సీజ్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటికి కొంతమంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి రావడం తో వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 23.03.2020 నుండి 22.05.2020 వరకు మొత్తం  74,565 వాహనలను సీజ్ చేయడం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాలను గత నాలుగు రోజులుగా సంబంధిత వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలను అధికారులకు అందించి తమ వాహనాలను తీసుకు వెళ్లడం జరుగుతుంది.

వాహనదారులు తిరిగి రోడ్లపైకి వచ్చే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నియమ, నిబంధనలు, సూచనల మేరకు కోవిడ్ రక్షణ చర్యలను పాటించవలసిదిగా వాహన యజమానులకు సూచించడం జరుగుతుంది.

మొత్తం : 74,565 వాహనాలను స్వాధీనం చేసుకోగా 23.05.2020 వ రోజు నుండి ఈ రోజు 26.05.2020 వరకు 52,628 వాహనాలను తిరిగి ఇవ్యడం జరిగింది. ఇంకా 21,937 వాహనాలు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి.

మిగిలిన వాహనాలకు సంభందించిన యజమానులు సాధ్యమైనంత మేర తమ వాహనలను తిరిగి పొందవలసిందిగా పోలీసు వారు కొరడమైనది.