గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 1 డిశెంబరు 2021 (12:34 IST)

సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ ఆస్తులు వారేవా!

ప్ర‌భుత్వం డ‌బ్బులేక‌, దివాళా తీస్తుంటే... ప్ర‌భుత్వ అధికారులు మాత్రం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నారు. ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ ఆస్తులు చూస్తే, ఎవ‌రైనా వారేవా అనాల్సిందే! 
 
 
ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ బిల్లురి నాగభూషణం ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసింది. విజయవాడ, హైదరాబాద్ లలో సహా  ప‌లు చోట్ల ఏక కాలంలో ఏసీబీ సోదాలు జ‌రిగాయి. విజయవాడలో ఏకకాలంలో పలు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కావూరి హిల్స్‌, నిజాంపేట, మోయినాబాద్‌లో ఫాంహోస్‌లను ఏసీబీ గుర్తించింది. అలాగే విజయవాడ పోరంకిలోని ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేసింది.


ఎండీ బిల్లురి నాగభూషణం కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి స్థలం, 5 ఇళ్లు, జి+5 ఫ్లోర్‌ బిల్డింగ్‌ను ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ల‌తో స‌హా గుర్తించారు. వీటితోపాటు 3 కార్లు, బైక్‌, వెండి, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ సుమారు 5.93 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.            

 
ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ బిల్లురి నాగభూషణం వ‌ద్ద దాదాపు 4.34 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. దర్యాప్తు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయ‌న్ని హాజరు పర్చనున్నారు.