శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (08:58 IST)

తిరుమలలో అచ్చెన్న

తీవ్ర అనారోగ్యంతో పాటు జైలు నుంచి బయట పడిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చారు.

బుధవారం ఉదయం విఐపి బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. త్వరగా బెయిల్‌ మంజూరు కావాలని, కరోనా నుంచి ఆరోగ్యంగా బయటపడితే శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు. మొక్కు తీర్చుకునేందుకే తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. 
 
వైద్య సేవల కాంట్రాక్టు విషయంలో అరెస్టయి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో రెండు రోజుల క్రితం ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.