టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని
వైకాపాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ళనాని పార్టీ మారుతున్నారు. తన సొంత పార్టీ వైకాపాకు రాజీనామా చేసి ఆయన టీడీపీలో చేరబోతున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆళ్ల నాని టీడీపీలో చేరడం ఖాయమని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు.
ఆళ్లనాని చేరికపై టీడీపీ అధిష్టానం కూడా కీలక నిర్ణయం తీసుకుందని, అందువల్ల అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైకాపా కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇపుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి పేర్కొన్నారు.
కాగా, రెండు నెలల క్రితం వైకాపా, పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి ఆహమీ ఇవ్వలేదు. పైగా, టీడీపీ చేరుతున్నట్టు ఆళ్ల నానే స్వచ్ఛందంగా ప్రటించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం పార్టీ చేరడం ఖాయమని తేలిపోయారు.