శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (11:55 IST)

అమరావతి పరిరక్షణ కోసం కేంద్ర సాయం కోరుతాం : సుజనా చౌదరి

రాజధాని అమరావతిని పరిరక్షించుకునేందుకు కేంద్ర సాయాన్ని కోరుతామని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. మహిళల పై దాడి‌ చేసి, అరెస్టు చేయడం అన్యాయం. ఆరోజు అమరావతిని రాజధానిగా వద్దని జగన్ చెప్పలేదు. 
 
అధికారులు గుమ్మం ముందుకు వెళ్లి మరీ ఆరోజు స్థలం, పొలం అడిగారు. ఒంగోలులో మహిళలపై మగ పోలీసులు దాడి‌చేయడం కలచి వేసింది. ఇటువంటివి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండటం ఎందుకు. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా... ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా. కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి ఈ దారుణాలు ఆపాలి అని పిలుపునిచ్చారు.

ఆరు నెలల్లో ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయింది. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదు. అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారు. ఏ నిబంధనలు ప్రకారం అర్థరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారు. అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా అడ్డుకున్నారు. కులం, వివరాల కోసం ఇబ్బందులు పెడతారా. వైసిపి ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారు. 
 
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డిజిపి ఏం‌ చేస్తున్నారు. వైసిపి ఎంపి, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ లేక‌ సిగ్గుతో తలదించు కుంటున్నారు. భిన్నాభిప్రాయాలు నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలి. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సిఎం అనేది గుర్తుంచుకోవాలి. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. 13 జిల్లాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించాలి.

మా పార్టీ సిద్దాంతం ఏదైనా.. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఫైట్ చేస్తా. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. అమరావతి ఇక్లడే ఉండేలా కృషి‌ చేస్తా. తన, మన, కుల, మత, ప్రాంతాలకు‌ అతీతంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇది సరి‌ చేయలేకపోతే నా పదవులు నాకు అనవసరం.

పార్టీ సహకారం లేకున్నా.. వ్యక్తిగతంగా అయినా పోరాడతా. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి. ఇవన్నీ‌ చూస్తూ.. మౌనంగా ఉండలేను. కేంద్రం కూడా పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. డిజిపి కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. కాకుంటే..‌ ఆయన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ హెచ్చారు.