శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (14:52 IST)

వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వాలంటీర్.. నాలుగు రోజులు?

Rape
ఏపీలో వాలంటీర్ల అరాచకం పెరిగిపోతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ వివాహితను 20 రోజులు బంధించిన వాలంటీర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. యాడికి మండలానికి చెందిన ఓ గ్రామానికి చెందిన వివాహిత మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అదే మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన దాసరి సతీశ్‌ గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. 
 
సతీష్ గత 3 నెలలుగా వివాహిత ఇంటికి తరచూ వెళుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 7న వివాహిత తన ఆరేళ్ల కూతురితో దుకాణంలో ఉండగా సతీశ్‌ అక్కడికి కారులో వెళ్లాడు. ఆమెను బయటకు పిలిచి తన కోరిక తీర్చాలని లేదంటే భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. బలవంతంగా వివాహితను చిన్నారిని కారులో ఎక్కించుకుని రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇలా బాధితురాలి కళ్ల ఎదుటే పలుసార్లు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజులుగా తల్లీ కూతుళ్లు కనబడక పోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఈ నెల 11న యాడికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతి పోలీసుల సహకారంతో వివాహితను ఈ నెల 25న వాలంటీరు చెర నుంచి విడిపించారు.