మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:14 IST)

కేరళకు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం... బయలుదేరిన మూడు లారీలు

అమరావతి : కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనుంది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెం

అమరావతి : కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనుంది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళలోని అయిదు జిల్లాల బాధితులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందులో అలపుఝా జిల్లాలోని చెర్తాలా ప్రాంత బాధితులకు, ఎర్నాకుళంలోని ఎడతలా ప్రజలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున, పతనాతిట్టా జిల్లాలోని ఆదూర్ టౌన్‌కు 400 మెట్రిక్ టన్నులు, పతనాతిట్టా టౌన్ ప్రజలకు 100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. త్రిశూర్ జిల్లాలో త్రిశూర్ టౌన్ ప్రజలకు 400 మెట్రిక్ టన్నులు, వేనాఢ్ జిల్లాలో భేతరి టౌన్ వాసులకు 100 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. 
 
బియ్యం పంపిణీపై ఇప్పటికే కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులకు ఏపీకి చెందిన అధికారులు సమాచారమందించారు. సచివాలయం నుంచి మూడు లారీలతో బియ్యాన్ని అధికారులు పంపించారు. వాటికి సీఎం చంద్రబాబునాయుడు జెండా ఊపి ప్రారంభించారు.