సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (14:30 IST)

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. 12మంది మృతి.. కొత్తగా 765 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,962 శాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 765 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. 
 
వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 727 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32 మంది.. ఆరుగురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 17699కి చేరింది.
 
అలాగే గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 
 
ఇప్పటి వరకు ఏపీలో 17,699 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ప్రస్తుతం 9473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8008 మంది డిశ్చార్జ్ అయ్యారు. 218 మంది చనిపోయారు.