సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (12:07 IST)

పొన్నూరు ఎమ్మెల్యేకు కరోనా.. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫెరెన్స్‌కు వెళ్లి..?

Ponnur MLA
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి నాయకులు, ప్రజా ప్రతినిధులు వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా అధికారపార్టీ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. ఈ విషయాన్ని గుంటురు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన కిలారి రోశయ్య సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. 
 
గురువారం కరోనా టెస్టులు చేయించుకున్నానని.. కలెక్టరేట్‌లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందన్నారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని రోశయ్య తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానంటూ పేర్కొన్నారు.  
 
ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటీవ్ అని తెలియడంతో కలెక్టరేట్‌లో మీటింగ్‌కు హాజరై ఆయనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు, మిగతా ప్రజా ప్రతినిధులు భయాందోళనకు గురవుతున్నారు.