గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (16:47 IST)

ఏపీలో కరోనా అప్డేట్ : కొత్తగా 1859 కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1859 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,86,015 కి పెరిగింది.
 
ఒక్క రోజు వ్యవధిలో మరో 13 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13, 595 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1575 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 
 
ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,53,732 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 70, 757 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 54, 53, 520 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.