సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (09:02 IST)

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఛార్జీషీట్ దాఖలు చేసిన సీఐడీ

Chandra babu Naidu
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో విచారణలో ఉంది. 
 
సిఐడి తన ఛార్జిషీట్‌లో చంద్రబాబు నాయుడును నిందితుడిగా నంబర్‌వన్ (ఎ1), ఆ తర్వాత అచ్చెన్నాయుడును ఎ2గా, గంటా సుబ్బారావును ఎ3గా, మాజీ ఐఎఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణను ఎ4గా పేర్కొంది. 
 
చంద్రబాబు నాయుడుపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే మొదటి కాదు. గతంలో ఫైబర్ నెట్  అసైన్డ్ భూములకు సంబంధించిన కేసుల్లో అభియోగాలు మోపారు.
 
 టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ముసుగులో షెల్ కంపెనీల కుంభకోణం, రూ.241 కోట్ల దుర్వినియోగం కారణంగా ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 
 దాదాపు రెండు నెలలు రాజమండ్రి జైలులో గడిపిన చంద్రబాబు నాయుడు గత ఏడాది అక్టోబర్ 31న విడుదలయ్యారు.