మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (20:37 IST)

సీఎం చంద్ర‌బాబు చిత్ర‌ప‌టంపై చెత్త ప్లేట్లు... మంత్రి గంటా సీరియ‌స్

అమ‌రావ‌తి : స‌చివాల‌యంలోని నాలుగో బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టంపై చెత్త‌, ప్లేట్లను విద్యాశాఖ అధికారులు వేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియ‌స్ అయ్యారు. ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వా

అమ‌రావ‌తి : స‌చివాల‌యంలోని నాలుగో బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టంపై చెత్త‌, ప్లేట్లను విద్యాశాఖ అధికారులు వేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియ‌స్ అయ్యారు. ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వార్త మీడియాలో రాగానే  ప్ర‌త్యేక‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకొన్నారు. 
 
ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌టం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించారు. ఘ‌ట‌న‌పై విచారించి నివేదిక ఇవ్వాల‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌ను ఆదేశింశారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి గంటా స్ప‌ష్టం చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోపై చెత్త, ప్లాస్టిక్ ప్లేట్లను వేసిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం అంతా మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.