సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (17:51 IST)

బ‌ద్వేలు విజ‌యంతో సీఎం జ‌గ‌న్ కు అభినంద‌న వెల్లువ‌

ఏపీలో బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అభినంద‌న‌ల వెల్లువ అవుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు మొద‌లుకొని, పార్టీ నేత‌లు ఆయ‌న్ని క‌లిసి అభినంన‌ద‌న‌లు తెలుపుతున్నారు. రాష్ట్రంలో పాల‌న‌కు ఈ ఎన్నిక‌లో విజ‌యం తాజా ప్ర‌తీక అంటూ కొనియాడుతున్నారు.
 
 
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి క‌లిశారు. పుష్ప‌గుచ్చం అందించి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సీఎం జ‌గ‌న్ ని అభినందించారు. ఆయ‌న ప్ర‌తిస్పందిస్తూ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా సీఎంని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు కూడా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.