ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 3 జనవరి 2022 (19:18 IST)

దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ తో సీఎం జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత ఏపీ సీఎం జ‌గ‌న్ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను నివేదించారు. ఆర్ధిక మంత్రికి ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు.
 
 
ప్రత్యేక తరగతి హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల‌ని కోరారు. ప‌లు అంశాల‌పై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాజిటివ్ గా స్పందించార‌ని సీఎంఓ వ‌ర్గాలు తెలిపాయి.