గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (17:00 IST)

ఢిల్లీపై ఒమిక్రాన్ పడగ - మొత్తం శాంపిల్స్‌లో 84 శాతం ఆ కేసులే...

దేశ రాజధాని ఢిల్లీపై ఒమిక్రాన్ వైరస్ పడగ విసిరింది. విపరీతంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. డిసెంబరు 30-13 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన కేసుల్లో ఏకంగా 84 శాతం కేసులు ఒమిక్రాన్ కేసులుగా నమోదైనట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే 6.5 శాతం మేరకు పాజిటివ్ రేటు ఉంది. 
 
మరోవైపు, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర వుంది. ఢిల్లీలో ఆదివార ఏకంగా 3194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే శనివారం నాటి లెక్కలతో పోల్చితే 15 శాతం అధికం.