ఆర్.ఆర్.ఆర్.కు ఆ సమస్య తీరలేదు
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్.) సినిమా ప్రమోషన్ బాగానే జరుగుతుంది. అయితే ఎక్కడో కొద్దిగా విడుదల అనుమానం నెలకొంది. దేశంలో డిల్లీ, మహారాష్ట్ర, యు.పి. వంటి ప్రాంతాల్లో నైట్ కర్వూ వంటివి వుండడం ఆర్.ఆర్.ఆర్. టీమ్‌కు నిరాశే కలిగింది. ఇక తెలంగాణలో టిక్కట్ల పెంపుకు ఓకే అన్న ప్రభుత్వం ఎ.పి.లో ఇంకా సమస్య తీరలేదు.
ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా జనవరి 7నే విడుదల అవుతుందని రాజమౌళి నొక్కి చెప్పినా అసలైన తెలుగు రాష్ట్రంలో పరిస్థితి కుదుట పడలేదు.సీజ్ చేసిన థియేటర్లు ఓపెన్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా టిక్కట్ల పెంపు విధానం ఇంకా సమసిపోలేదు. ఓవర్‌సీస్‌లో ఆశాజనకంగా వున్నా మన దగ్గర అంతగా లేదు. దీనిపై త్వరలో ప్రకటన వెలువడనుంది.
తాజాగా ఎ.పి. ప్రభుత్వంతో ఓ కమిటీని నియమించింది. అందులో పలువురు మేథావులు వున్నారు. కానీ ఇప్పటివరకు వారికి ఎటువంటి సమాచారం లేదు. ఎప్పుడు ఎలా మీటింగ్ జరుగుతుందో తెలియడంలేదు. బహుశా జనవరి 1,2 తేదీల్లో పిలుపు రావచ్చని కమిటీ సభ్యుల్లో ఒకరైన నారాయణ తెలియజేస్తున్నారు.
భారీ సినిమా సాధారణ రేట్లు తోనే ఏపీలో ప్రదర్శితం కానుందని వార్త బాగా వినిపిస్తోంది. ఎ.పి. ఛాంబర్ ఆఫ్ కామర్ష్ అధ్యక్షుడు కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి విజయ్‌చందర్ కానీ దీనిపై స్పందించడంలేదు. త్వరలో అన్ని సమస్యలకు పరిస్కారం అవుతుందని మాత్రమే తెలియజేస్తున్నారు.