గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (10:06 IST)

ముచ్చటగా మూడోసారి.. బందరు పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

ys jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. బందరు పోర్టుకు 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే పోర్టుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ శంకుస్థాపన చేస్తున్నారు.  
 
రెండున్నరేళ్లలో ఈ పోర్టును పూర్తి చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం సీఎం జగన్ మచిలీపట్నం చేరుకుని.. అక్కడ నుంచి తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. ఆపై బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టు రూ.5.156 కోట్లతో నిర్మితం కానుంది. 
 
ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యింది. బందరు పోర్టు కోసం 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది.