1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (09:23 IST)

21 నుంచి ఏపీ సీఎం జగన్ దంపతుల లండన్ పర్యటన

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ నెల 21వ తేదీ నుంచి లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెను చూసేందుకు వెళుతుంటారు. పైగా, ప్రతి యేటా సీఎం జగన్ దంపతులు లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు జగన్ దంపతులు లండన్‌కు వెళుతున్నారు. 
 
తన భార్య భారతీ రెడ్డితో కలిసి ఆమె ఈ నెల 21వ తేదీన లండన్‌కు బయలుదేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడుపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వారి వ్యక్తిగతం. గత యేడాది జగన్ కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వారిద్దరూ లండన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. గతా, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 నుంచి జగన్ దంపతులు క్రమం తప్పకుండా లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే.