ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (13:54 IST)

దుర్గమ్మ సేవలో కుమార్తె ఆద్యతో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్ (video)

pawan on indrakeeladri
దశన్నవరాత్రుల్లో భాగంగా, బెజవాడ కనకదుర్గమ్మ వార్షిక వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సేవలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. 
 
తొలుత ఆలయం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్‌తోపాటు ఏపీ హోం మంత్రి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. 
 
అంతకుముందు మరో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇలాగే, అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా ఇంద్రకీలాద్రిపైకి తరలివచ్చారు. దీంతో దుర్గమ్మ ఆలయ ప్రాంగణం కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంది.