గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 13 అక్టోబరు 2021 (10:47 IST)

నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పికె మిశ్రా ప్రమాణ స్వీకారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ జస్టిస్ పికె మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, తదితరులు పాల్గోనున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాన్ని అందజేశారు. రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ .పి .సిసోడియా కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.