శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:29 IST)

నేను తీసుకెళ్లింది బ్యాలెట్ పేపర్లు కాదు.. తాళాలు మాత్రమే: ‘మా’ ఎన్నికల అధికారి

‘‘ఆదివారం అనసూయ గెలిచిందని వచ్చిన వార్తలు అబద్దం. అలాగే నేను బ్యాలెట్ పేపర్స్‌ని ఇంటికి తీసుకెళ్లినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను తీసుకెళ్లింది బ్యాలెట్ పేపర్స్ కాదు. అవి ఉన్న బాక్సులకు వేసిన తాళాల కీస్‌ని మాత్రమే నేను తీసుకెళ్లాను.. బ్యాలెట్ పేపర్స్‌ని కాదు..’’ అని ‘మా’  ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.
 
‘మా’ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడైన తర్వాత టాలీవుడ్‌లో కొత్తకొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మంగళవారం ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానల్ ప్రత్యర్థి మంచు విష్ణు ప్యానల్‌పై, మోహన్‌బాబుపై అలాగే ఎన్నికల అధికారి అయిన కృష్ణమోహన్‌పై కొన్ని ఆరోపణలు గుప్పించారు.

మరీ ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన అనసూయ విషయంలో ఏదో జరిగింది? అనేలా ఆమె రియాక్ట్ అవడంతో పాటు బ్యాలెట్ పేపర్స్ ఎన్నికల అధికారి ఇంటికి తీసుకుని వెళ్లినట్లుగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణలపై తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు.