ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:10 IST)

ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారు : మంత్రి అంబటి రాంబాబు

ambati
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు రైతులను ఉద్దేశించి ఘాటైన వాఖ్యలు చేశారు. రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన మూడో విడత చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, అమరావతి ప్రాంతంలో రాజధాని కావాలనే పేద రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరన్నారు. యాత్ర చేసేవారంతా ఒళ్లు బలిసి చేస్తున్న వారేనని, వారంతా డబ్బున్నవారన్నారు. 
 
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. ఇపుడు వారి భూములకు విలువ తగ్గిపోతుందని భయంతో అమరవాతి రైతుల పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కావాలంటే గుడివాడ వెళ్లి తొడ కొడితేనే, మీసం మెలేస్తేనే రాదన్నారు.