మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (21:26 IST)

తెలంగాణ కంటే ఏపీ ఎంతో బెస్ట్.. కేసీఆర్‌కు ఏపీ మంత్రి కౌంటర్

తెలంగాణ కంటే ఏపీ ఎంతో బెస్ట్ అంటూ ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో కరెంటు కోతలున్నాయ్.. తెలంగాణలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయ్.. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారంటూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 
 
తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు అవుతున్నట్టు మంత్రి అనిల్ తేల్చి చెప్పారు. తెలంగాణలో అమల్లో ఉన్న పథకాలను ఏపీలో అమలు చేయాల్సిన అవసరమే లేదన్నారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే.. కేసీఆర్ అలా టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడి ఉండవచ్చని మంత్రి అనిల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
దళిత బంధు పథకంపైనా.. అనిల్ స్పందించారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఆ పథకాన్ని అమలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకం అమలులో లేదని ఆయన చెప్పారు. ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీని ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారని.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి అనిల్ స్పందించారు. కావాలనుకుంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. తమకు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.