మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (21:21 IST)

వివాదంలో ఏపీ మంత్రి: ఆ వీడియో వైరల్ కావడంతో..?

ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గుమ్మనూరు జయరాం మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు మంత్రిగారి వార్నింగ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అధికార పార్టీ నేతల అసలు స్వరూపం ఇదేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఆలూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎస్సైతో సంభాషించారు మంత్రి జయరాం… ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టున్నారని 40 మంది వరకు నాకాడికి వచ్చారని ఎస్సైతో ఫోన్‌లో మాట్లాడారు జయరాం.. అయితే, ఇసుక అక్రమ తవ్వకాలు వద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఎస్సై.. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వుకోవాలని సూచించాడు. 
 
దీంతో.. మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వెంటనే వదిలేయాలని సంబంధిత ఎస్సైకి ఆదేశాలు జారీ చేసిన మంత్రి.. లేనిపక్షంలో అధికారంలో ఉండి, మంత్రిగా ధర్నా చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
 
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఎస్సైని తీవ్రస్థాయిలో హెచ్చరించారు మంత్రి జయరాం… నాకు మంత్రి పదవి లెక్కలేదన్న ఆయన.. నాకు ప్రజలు కావాలి… మరోసారి పోటీ చేసేది కూడా నేనే అన్నారు.. నేను గెలిస్తేనే ఇక్కడ వ్యవహారం నడుస్తుంది అంటూ ఎస్సైని బెదిరించిన మంత్రి… నేను ధర్నాకు దిగాలా లేక ట్రాక్టర్లను వదిలేస్తారా…? అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.