ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (14:26 IST)

వైకాపా నేతలు ఇంకెంత దిగజారిపోతారో.. ఛీఛీ.. : వైస్ షర్మిల

ys sharmila
ఏపీలో అధికారం అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు చేస్తున్న ఆగడాలకు అంతే లేకుండా పోయింది. సామాన్య ప్రజానీకం నుంచి జాతీయ స్థాయి క్రికెటర్ల వరకు వేధింపులకు పాల్పడుతున్నాు. తాజాగా జాతీయ క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అనుసరించిన తీరు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా అని ఆమె మండిపడ్డారు. 
 
అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్న వైకాపా వాళ్లు, ఇప్పుడు క్రీడలపైనా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన ఈ నేతలు.. ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేమన్నారు. 'ఆడుదాం ఆంధ్రా అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైకాపా నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా.. అధ్వానపు క్రికెట్ అసోసియేషనా? ఈ విషయంపై వెంటనే విచారణ జరగాలి' అని షర్మిల డిమాండ్ చేశారు. 
 
పరువు నష్టం దావా కేసులో తప్పును అంగీకరించిన సీఎం కేజ్రీవాల్ 
 
పరువు నష్టం దావా కేసులో చేసిన తప్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను రీట్వీట్ చేయడంతో కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సమన్లు కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వీడియోను రీట్వీట్ చేయడం పొరబాటేనని చెప్పారు. దీంతో కేజ్రీవాల్‌పై బలవంతపు చర్య తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018లో రూపొందించినట్లు చెబుతున్న ఓ వీడియోను కేజ్రివాల్ రీట్వీట్ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అదేసమయంలో కింది కోర్టు జారీచేసిన సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీంతో కేజీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
కేజ్రివాల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజీవాల్ కోరారు. ఈ మేరకు కేజీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. కేజీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారు సూచనను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఫిర్యాదుదారు తరపు న్యాయవాది రాఘవ్ అవస్తీ సమయాన్ని కోరారు. దీంతో ఈ కేసులో కేజీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.