మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 17 మే 2021 (17:01 IST)

రోజా కోలుకున్నారు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు

ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కోలుకున్నారు. సెకండ్ వేవ్ కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో నగరి ఎమ్మెల్యే ఏమైపోయారంటూ ప్రజలు ప్రశ్నించడం మొదలెట్టారు. దీంతో రోజా తాను కోలుకున్నట్లు చెబుతూ అధికారులతో జూమ్ యాప్ ద్వారా చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. 
 
నిన్న నగరి, ఈరోజు నిండ్ర మండలాలకు చెందిన ప్రభుత్వ అధికారులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు రోజా. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కర్ఫ్యూను తూచా తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రోజా.
 
ప్రస్తుతం నగరిలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోందని.. కేసులు తగ్గుతున్నాయని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని విజ్ఙప్తి చేశారు రోజా. సామాజిక దూరాన్ని పాటించాలని.. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దన్నారు. ప్రస్తుతం తాను చెన్నైలోనే ఉన్నానని... త్వరలోనే నగరికి వస్తానంటున్నారు.