సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (17:38 IST)

ఏపీలోని నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

thunder
ఏపీలోని నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ సూచించారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య జిల్లాలకు పిడుగు హెచ్చరిక చేశారు. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నంలో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. 
 
మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాయలసీమతో పాటూ కొస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. చిత్తూరులోని కుప్పంలో వర్షం కురుస్తోంది