మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:57 IST)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు... రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఆటో మ్యుటేషన్‌ సేవలు

భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్‌) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో రైతులకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరములు రిజిస్ట్రేషను చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులలో మార్పులు కొరకు తహసీల్దారు కార్యాలయం మరియు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసి వచ్చేది.

అందువలన రైతులకు ఆసౌకర్యం కలుగటయే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. 
ఈ నేపధ్యంలో రిజిస్ట్రేషను చేయబడిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు మరియు పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టం, 1971 ను సవరించడం ద్వారా భూ బదలాయింపు వివరాలు రికార్డు చేయడానికి గాను, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారులను తాత్కాలిక(ప్రొవిజనల్‌) రికార్డింగ్‌ అధికారులుగా గుర్తింపు, వీరి నియామక అధికారం సంబంధిత జిల్లా కలెక్టర్లదే. 
 
రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ భూమి బదలాయింపు కొరకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ఆర్‌ ఓ ఆర్‌ –1బి, అడంగల్‌) వివరములు ఆన్‌ లైన్‌ ద్వారా రెవెన్యూశాఖకు పంపబడతాయి.
 
ఈ భూ మార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్‌ పోర్టల్‌ ( (www.meebhoomi.ap.gov.in  ) లో సరిచూసుకునే సదుపాయం కూడా కల్పించబడింది. ఆటో మ్యుటేషన్‌ ఫైలట్‌ ప్రాజెక్టు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నందు 2019లో ప్రారంభమైంది.

విజయవంతంగా అమలవుతున్న ఆటో మ్యుటేషన్‌ ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 
 
ఆటో మ్యుటేషన్‌ వల్ల ఉపయోగాలు
- భూ రిజిస్ట్రేషన్‌ మొదలు, e - పాసుబుక్‌ జారీ వరకు ఆన్‌లైన్‌లో జరగనున్న మొత్తం ప్రక్రియ

- ఇకపై పట్టాదారులు ఆన్‌ లైన్‌ భూ బదలాయింపు కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 
 
- భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్‌ నంబరుకు సంక్షిప్త సమాచారం ద్వారా అందనున్న అప్‌డేట్‌ 
 
- 30 రోజుల్లో తహసీల్దార్‌ ధృవీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల నందు R O R - 1 B లో శాశ్వత నమోదు
- అనంతరం  e - పాసుబుక్‌ వెంటనే పొందే అవకాశం.