సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (08:48 IST)

మా అక్క అఖిల ప్రియ అరెస్టు వెనుక కుట్ర : భూమా మౌనికా రెడ్డి

తన అక్క భూమా అఖిలప్రియా రెడ్డి అరెస్టు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె చెల్లెలు భూమా మౌనికా రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్, బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన మౌనికా రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల ప్రియ అరెస్టు కుట్ర అని అన్నారు. అఖిల అరెస్టు వెనకాల రాజకీయ పెద్దల హస్తం ఉందని వెల్లడించారు. అక్కకు రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 
 
అంతేగాకుండా ఆడపిల్ల మీద రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారని, మా అక్కకు బెయిల్ వచ్చాక అందరి పేర్లు బయట పెడతా అని ఆమె హెచ్చరించారు. దీని గురించి, త్వరలోనే రాష్ట్ర గవర్నర్, కేంద్ర సహాయ హోం మంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ను కలుస్తా అని అన్నారు. 
 
అంతేగాకుండా భూమా కుటుంబం నుంచి నేను బాధ్యత తీసుకుంటాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తే అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడకండి అని ధైర్యం చెప్పారు.