శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (10:20 IST)

శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)

Naresh
Naresh
పవిత్రమైన శ్రీవారి సన్నధిలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ రెచ్చిపోయారు. వెంకన్న ఆలయంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయారు. "థర్డ్ క్లాస్ నా కొడుకువి" అంటూ తీవ్రపదజాలంతో దూషణకు దిగారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా నరేష్ కుమార్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. 
 
అయితే టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేటు నుంచి ఎవరినీ పంపడం లేదన్నాడు. అంతేగాకుండా ఈ ద్వారం నుంచి పంపేది లేదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంకా ఈ ద్వారం గుండా పోవాలంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.
 
దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ టీటీడీ ఉద్యోగిపై విరుచుపడ్డారు. బూతులు తిట్టారు. "ఇక్కడ నిన్నెవరు నిలబెట్టారంటూ.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అంటూ దూషణకు దిగారు. అంతేగాకుండా థర్డ్ క్లాస్ నా కొడుకువి.. ఏయ్‌ లోపలికి కాదు.. ముందు నువ్వు బయటకు పో" అంటూ ఉద్యోగిని అభ్యంతరకర పదజాలంతో దూషించాడు.