సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (14:55 IST)

బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

Borugadda Anil Kumar
వైకాపా సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్‌కు కోర్టు మరోమారు 14 రోజుల రిమాండ్ విధించింది. బాబు ప్రకాష్ అనే వ్యక్తిని రూ.50 లక్షల డిమాండ్ చేసిన కేసులో పోలీసులు అనిల్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో బోరుగడ్డ అనిల్‌కు గుంటూరు న్యాయస్థానం మరో 14 రోజుల రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాతో బోరుగడ్డ అనిల్ నవంబరు 12 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలులో తరలించనున్నారు. 
 
గుంటూరులులో కర్లపూడి బాబు ప్రకాశ్ అనే వ్యక్తిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఇటీవల కోర్టుకు మూడు రోజులు కస్టడీకి అనుమతించడంతో, గుంటూరు పోలీసులు అనిల్‌ను ప్రశ్నించారు. ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా అనిల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. 
 
మరోవైపు, బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గత యేడాది మార్చి 31వ తేదీ జరిగిన దాడికి సంబంధించి బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు కూడా నమోదైన విషయం తెల్సిందే. ఈ దాడి కేసులో వైకాపా మాజీ మంత్రి నందిగం సురేశ్ ఏ1గాను, అనిల్ ఏ2గా ఉన్న విషయం తెల్సిందే.