గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (09:47 IST)

ఏలూరులో పోలీసులపై తిరగబడిన స్థానికులు

attack on police
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల వైఖరిపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా ఏలూరులో పోలీసులపై స్థానికులు దాడి చేశారు. కోడిపందాలు, పేకాట ఆడుతున్న బృందాలపై పోలీసులు దాడులు చేశారు. దీంతో తిరగబడిన స్థానికులతో కలిసి పేకాట రాయుళ్ళు పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుళ్ళను తరిమికొట్టారు. 
 
ఈ ఘటన ఏలూరు లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం మేరకు గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాట, కోడిపందాలు ఆడుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు ధర్మాజీగూడెం పోలీసులు యడవల్లి గ్రామంలో దాడులు నిర్వహించారు.
 
పోలీసులను చూడగానే కార్డుదారులు ఎదురుపడి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉమా మహేశ్వర్‌రావు, ఇతర కానిస్టేబుళ్లు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.