ఏ1 జగన్ - ఏ2 విజయసాయిలు విచారణకు రావాల్సిందే.. తేల్చిచెప్పిన కోర్టు
అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిలు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టంచేసింది. జగన్మోహన్ రెడ్డితో పాటు.. విజయసాయిరెడ్డిపై పలు అక్రమాస్తుల కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఈ కేసులో జగన్ ముఖ్యమంత్రి కాకమునుపు ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణకు సీఎం జగన్ డుమ్మా కొడుతూ వచ్చారు.
ఈ క్రమంలో శుక్రవారం ఈ కేసు విచారణ జరిగింది. ఇందులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిలు ఈనెల 10వ తేదీన తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనంటూ జగన్ తరపు న్యాయవాదులకు స్పష్టంచేసింది. వచ్చే శుక్రవారం నుంచి క్రమం తప్పకుండా విచారణకు రావాల్సిందేనంటూ స్ష్టం చేసింది.