సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:07 IST)

త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం

ntr coin
మహా నటుడు, దివంగత నందమూరు తారక రామారావు బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెం అందుబాటులోకిరానుంది. ఎన్టీఆర్ బొమ్మతో  100 రూపాయల నాణెంను ముద్రించేందుకు భారత రిజర్వు బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదిత నాణెం నమూనాను కూడా ముద్రించారు. 
 
ఇదే అంశంపై ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి ఆర్బీఐ మింట్ అధికారులు చూపించారు. ఈ నాణెం నమూనాపై ఆమె నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ నమూనాకు కూడా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో కూడా వంద రూపాయల నాణె చెలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.