గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (12:34 IST)

అంగళ్ళు ఘటనలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. పైగా, పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
కాగా, అన్నమయ్య జిల్లాలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటి ప్రాజెక్టు పనులను వైకాపా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద టీడీపీ, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని చంద్రబాబు పిటిషన్‌ వేశారు. తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే, గొడవలకు చంద్రబాబే కారణమంటూ ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.