శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 6 డిశెంబరు 2019 (19:41 IST)

నారా లోకేష్‌‌కు చంద్రబాబు క్లాస్, ఎందుకంటే?

ఇప్పటికే కుమారుడు రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయాడన్న బాధ చంద్రబాబులో ఉందని రాజకీయ విశ్లేషకులే చెబుతుంటారు. ఈ విషయం ఎక్కడ నలుగురు కలిసినా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టిడిపి నేతలు నలుగురు కలిసినా చర్చ మాత్రం ఖచ్చితంగా లోకేష్ గురించే జరుగుతుంది. 
 
ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌ పూర్తిస్థాయిలో రాజకీయాలను ఒంటపట్టించుకోకపోవడం.. అందులోను ట్విట్టర్ల రూపంలో ట్వీట్లు చేస్తూ ప్రభుత్వంపైనా, జగన్మోహన్ రెడ్డిపైనా విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమధ్య అమరావతిలో టిడిపి బృందం పర్యటించే సమయంలో నారా లోకేష్, చంద్రబాబుతో పాటు ఆ బస్సులోనే ఉన్నారు. 
 
అయితే రైతులు చెప్పులు విసిరేసే సమయంలో మాత్రం లోకేష్‌ ఒక నేతను మీ హెయిర్ స్టైల్ బాగుంది. మీరు హ్యాండ్‌సమ్‌గా ఉన్నారంటూ మాట్లాడారు. ఇది కాస్త ఆ బస్సులో ప్రయాణించే నేతలే వీడియోలు తీశారు. అందులో లోకేష్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. రైతులు ఆందోళన చేస్తూ చెప్పులు విసురుతుంటే లోకేష్ మాత్రం అదేదీ పట్టించుకోవడం మాట్లాడిన తీరు చంద్రబాబుకు బాగా కోపం తెప్పించిందట.
 
దీంతో చంద్రబాబు, లోకేష్‌ను పిలిచి క్లాస్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేస్తూ జగన్‌ను విమర్సిస్తున్న తీరు బాగానే ఉంది. అయితే బయటకు వచ్చినప్పుడు తప్పులు లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మాట్లాడడం నేర్చుకో. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు సీరియస్‌నెస్ కూడా నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఇంకా ఎదగాలి అంటూ చంద్రబాబు సీరియస్‌గా లోకేష్ బాబుకు చెప్పారట. మరి తండ్రి చెప్పిన మాటలను లోకేష్ వింటారో లేకుంటే వినీవిననట్లు వదిలేస్తారో చూడాల్సిందే.