శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (17:22 IST)

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ గురించి బాబు ఏమ‌న్నారో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు. మోదీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇత‌ర పార్టీల సీఎంలు ఎవ‌రున్నార‌నే అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కేసీఆర్ బీజేపీకి  దగ్గరవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఫినిష్ చెయ్యాలని చూశారని కానీ.. తెలంగాణ‌లో తెలుగుదేశం క్యాడ‌ర్ బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా.. మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్, జగన్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులివ్వాలని తెలిపారు. గెలవరని తెలిసి 2014లో బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.