ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (22:34 IST)

వైసిపి నాయకుల తోకలు కట్ చేస్తా: కుప్పంలో చంద్రబాబు నిప్పులు..!

రెండవ రోజు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు బిజీబిజీగా పర్యటించారు. లక్ష్మీపురం నుంచి ప్రారంభమైన బాబు రోడ్ షో కుప్పం పట్టణంలో సాగింది. 
 
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం ప్రశాంతమైన నియోజకవర్గమని.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా నన్ను కుప్పం ప్రజలు గెలిపించారన్నారు. కుప్పంలో టిడిపి చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్, వైసిపి చేసింది శూన్యమన్నారు. 
 
దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఎపిలో ఉన్నాయని.. దోచుకోవడం, దాచుకోవడమే జగన్  రాజకీయమన్నారు. ఎపిలో ఇసుక కొరత ఎక్కువగా కనిపిస్తోందని.. జగన్ చెత్త ముఖ్యమంత్రి.. చెత్తపై పన్ను వేస్తున్నాడన్నారు.
 
మరుగుదొడ్లకు పన్నేసిన ఘనుడు సిఎం అని.. పన్నులు కడుతున్నామని జగన్‌ను బాత్రూంలు కడిగమని చెప్పండన్నారు. ఎపిలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితుల్లో లేరన్నారు.
 
కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని.. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్ళను నిర్మించవద్దన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిందే ఉచితంగా ఇళ్ళను నిర్మించి ఇస్తామని.. చేతకాని పాలన వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని.. కుప్పం వైసిపి నేతలు ఓవరాక్షన్ చేస్తే తోకలు కట్ చేస్తామన్నారు.