శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (23:45 IST)

చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. సోమవారం విశాఖ, విజయవాడకు విమానాలు రద్దు చేసినట్లు సమాచారం.

ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేశారు. చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయితే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

కాగా చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన  సోమవారం ఉదయం విమానంలో విశాఖకు వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులను కూడా ఏపీ డీజీపీ నుంచి తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ ఈ పాస్ కూడా జారీ చేశారు.

అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుంచి విమానాలను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతిచ్చింది. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులను మూసివేయనున్నారు.