బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:17 IST)

విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు గోదా అష్టోత్తరం తో కార్యక్రమం ప్రారంభమైనది. అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి జరిగినది. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, క్రేన్  ఒక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి మంగళా శాసనాలు అందుకున్నారు.

ధనుర్మాస ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.