బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (11:49 IST)

సంచలనం రేపిన చిన్నారి నాగవైష్ణవి కేసులో నేడు తుది తీర్పు

విజయవాడ అప్పట్లో సంచలనం రేపిన చిన్నారి నాగ వైష్ణవి కేసులో నేడు తుది తీర్పు వెలువరించనుంది కోర్టు. 2010 జనవరి 30న చిన్నారి నాగ వైష్ణవిని కిడ్నాప్ చేసి... గొంతు నులిమి హత్య చేసిన అనంతరం బాయిలర్‌లో వేసి దహనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.

తన కూతురి హత్య వార్త విని గుండెపోటుతో తండ్రి పలగాని ప్రభాకర్ మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మొర్ల శ్రీనివాసరావు, వెంపరాల జగదీష్, పంది వెంకట్రావ్ గత ఏడేళ్లుగా జైలులో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే, నేడు తుది తీర్పు వెలువడనుంది.