చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం - ఇద్దరి మృతి

ttdj| Last Updated: సోమవారం, 2 మే 2016 (11:36 IST)
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంకు చెందిన ఐదు మంది కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కారులో వస్తుండగా పలమనేరు వైపు వెళుతున్న ట్రాక్టర్‌ కాటప్పగారిపల్లె వద్ద ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స చేస్తున్నారు. కారు అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :