శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (15:24 IST)

శోభనం గదిలో మృతి చెందిన వరుడు.. ఏమైంది?

bride
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే శోభనం గదిలో వరుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలో తులసీప్రసాద్‌, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు.
 
కాగా, గదిలోకి ‍ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్‌ బెడ్‌పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్‌.. తులసీప్రసాద్‌ గదిలో పడిపో​యి ఉండటంతో టెన్షన్‌కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్‌కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.