శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (17:32 IST)

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి ఇక లేరు. న్యుమోనీయా తో బాధ‌ప‌డుతూ, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ, ఆయ‌న మృతి చెందారు. 1955 మే 20 న అనకాపల్లిలో జన్మించిన సీతారామశాస్త్రి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. సిరివెన్నెల 11 నంది అవార్డులు  నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులు అందుకున్న ఏకైక గీత రచయిత. సిరి వెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కె విశ్వనాథ్ చిత్రాలతో ప్రఖ్యాతిగాంచిన సిరివెన్నెల.న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంట‌ల‌కు కన్నుమూశారు. 
 
 
సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాధ చాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. దాదాపు 800లకు చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.