మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (16:36 IST)

చంద్రబాబు ఇంటిని ముంచెత్తిన వరద నీరు..

babu cbn
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు గుంటూరు అమరావతి రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. దీంతో అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు తాడు సహాయంతో ఇద్దర్ని కాపాడారు. 
 
గలైంతయిన వ్యక్తి గుంటూరు వాసిగా గుర్తించారు. అమరావతి రాజధాని పరిధిలో ఊళ్లు మునిగాయి. కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పీలేరు వాగుకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  
 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది.
 
దీని ప్రభావం వల్ల ఉండవల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వరద ముంపు భయం నెలకొంది. ఏ క్షణంలోనైనా వరదనీరు ఆయన ఇంట్లోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదికి సంభవించిన వరద సమయంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోటును అడ్డం పెట్టారంటూ అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు.