బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (11:09 IST)

లండన్ మీదుగా దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్?

cmjagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ మీదుగా దావోస్ చేరుకున్నారు. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
 
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి శుక్రవారం ఉదయం తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి ప్రత్యేక లగ్జరీ విమానంలో బయలుదేరిన ఆయన ముందుగా లండన్‌కు వెళ్లి అక్కడ నంచి దావోస్‌కు చేరుకున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ప్రయాణించిన విమానం చేరుకుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. 
 
ఈ సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. కాగా, శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎం దంపతులకు వీడ్కోలు పలికారు.