మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (11:49 IST)

త్రిదండి చినజీయర్‌ స్వామికి సీఎం జ‌గ‌న్ పాదాభివంద‌నం!

ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామికి పాదాభివంద‌నం చేసి ఆయ‌న ఆశీస్సులు పొందారు. తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద్భంగా ఆయ‌న రాక‌కు భ‌క్తి తో ప్ర‌ణ‌మిల్లి, ఆయ‌న‌కు సీఎం జ‌గన్ ఒంగి పాదాలను తాకారు. 
 
 
రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ ఆయ‌న ఆహ్వానాన్ని అందుకుని, సానుకూలంగా స్పందించారు.

 
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామ‌ని, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేక, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలుంటాయ‌ని తెలిపారు. చినజీయర్‌ స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు వెంట ఉన్నారు.