బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:59 IST)

శుభవార్త చెప్పిన సీం జగన్ ... 'జగనన్న చేదోడు' నిధులు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. తాజాగా "జగనన్న చేదోడు" పథకం అమలులో భాగంగా అర్హులైన లబ్దిదారులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. 
 
మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. కాగా, ఈ పథకం అమలులో భాగంగా ప్రతి యేడాది షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
రెండో విడతలో 1.46 లక్షల మంది దర్జీలకు రూ.146 కోట్లు, షాపులున్న 98 వేల మందికి రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్లు చొప్పున నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు.