శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (18:06 IST)

కరోనా ఎఫెక్ట్.. క్రికెట్ ఆడారనీ..!

కరోనాతో అందరూ భయపడిపోతుంటే.. ఏమీ పట్టించుకోకుండా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులను గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. 

మంగళగిరి పట్టణంలో 144 సెక్షన్ మరియు లాక్ డౌన్ ప్రోగ్రాం కూడా అమల్లో ఉన్నప్పటికీ 27 తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు మంగళగిరి పట్టణం పార్క్ రోడ్డు 5వ లైన్ వద్ద క్రికెట్ ఆట ఆడుతూ ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్న ముగ్గురు యువకులను మంగళగిరి పట్టణ సీఐ  అరెస్టు చేసి  కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు పంపి మూడవ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇకపై పట్టణంలో అల్లరి మూకలు లేదా కుర్రవాళ్ళు ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో ఏదైనా ఆటలు కానీ మరేదైనా అసాంఘిక కార్యకలాపాలకు గాని పాల్పడి ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందడానికి దోహదపడితే వారిపై ఇంతకు మించి కఠినమైన సెక్షన్ లతో కూడిన చర్యలు తీసుకొనబడును అని పట్టణ సిఐ ప్రజలను హెచ్చరించడం జరిగింది.