శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:50 IST)

హమ్మయ్య ఊపిరి పీల్చుకున్న ఏపీ రాజ్‌భవన్... నలుగురికే కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ పని చేసే ఉద్యోగుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో ఆ నలుగురు కాంటాక్ట్ అయిన అనేక మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, వీరందరికీ నెగెటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజ్‌భవన్‌లో పని చేస్తూ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు ఓ నర్సు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు.
 
అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పరీక్షలు నిర్వహిచంగా నెగెటివ్ అని వచ్చింది. రాజ్‌భవన్‌లోని ఇతర సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. అయితే, తాజాగా ఏపీ సచివాలయంలో పని చేసే ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.